
టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లెట్లకు కొవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో క్రీడాకారులకు ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.