
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,27,960 కు చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 58 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 2208కి చేరుకుంది. నిన్న ఒక్కరోజేు కరోనా నుంచి 4009 మంది కోలుకోగా ఇప్పటి వరకూ 3,49,692 మంది కోలుకున్నారు.