
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు 1 నుంచి 11 వరకు 543 చిన్నారులకు కరోనా సోకింది. 499 కొత్త కేసులు గత ఐదు రోజుల్లో నమోదయ్యాయి. పిల్లల్లో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉన్నప్పటికి ప్రమాదకరంగా మారవచ్చని బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో చిన్నారుల కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.