
ఉత్తరప్రదేశలోని నోయిడాలోగల లుక్సర్ జైలులోని 23 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరందరినీ నోయిడాలోని ఒక ఆసుపత్రికి తరలించారు. వీరితో పాటు లుక్సర్ జైలుకి సంబంధించిన జైలర్ ఏకే సింగ్ తో పాటు అతని కుటుంబమంతా కరోనా బారిన పడింది. జైలర్ ఏకే సింగ్ ఆరోగ్యం మరింత క్షీణంచిన నేపథ్యంలో అతనిని కైలాష్ ఆసుపత్రిక తరలించారు. అతని భార్య, పిల్లలు హోంక్వారంటైన్లో చికిత్స పొందుతున్నారు. జైలులో బందీలుగా ఉన్న మొత్తం 200 మందికి కరోనా టెస్టులు చేయించగా వారిలో 23 మందికి పాజిటివ్ రిసోర్టు వచ్చింది.