
దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసులు 3 లక్షల లోపు నమోదయ్యాయి. అయితే భారీ సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 4,529 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. కొత్త కేసులు 3 లక్షలలోపే నమోదైనప్పడటికీ క్రితం రోజులతో పోల్చితే స్వలంగా పెరిగాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మంగళవారం 20,08,296 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,67,334 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. గత ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టిన కేసులు నిన్న స్వల్పంగా పెరిగాయి. మరోవైపు మరణాల సంఖ్య పెరగడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.