స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ రెండు భాగాలుగా విడగొట్టాలని నిర్ణయించుకున్న తరువాత.. కథలో చాలా మార్పులు చేయాల్సి వస్తోంది. సెకండ్ పార్ట్ లో కూడా కచ్చితంగా సాంగ్స్ పెట్టాలి, అలాగే ఫైట్స్ కూడా పెట్టాలి, అంటే సినిమా కథను పొడిగించాలి. ఒక్క రష్మికనే హీరోయిన్ గా పెట్టుకుంటే.. సినిమాని రెండు భాగాలుగా చేయడం కష్టం అవుతుంది.
అందుకే సుకుమార్ తెలివిగా రెండో పార్ట్ కోసం మరో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేస్తున్నాడు. ఎర్రచందనం కూలీ ఎన్నో కష్టాల సాహసాల తరువాత ఓ మాఫియా డాన్ గా మారితే ఎలా ఉంటుంది ? ఆ డాన్ కథనే రెండో పార్ట్ సినిమాగా తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సినిమా రగ్డ్ గా రఫ్ గా వుంటే, సెకెండ్ పార్ట్ సినిమా అల్ట్రా స్టయిలిష్ గా వుంటుందని, హీరోయిన్ ను కూడా స్టైలిష్ లా ఉండేలా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
పైగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఒక సినిమాని మొదటిసారి రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఎలాగూ ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి, బడ్జెట్ కూడా అంతే స్థాయిలో పెట్టాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రెండు పార్ట్స్ అయితేనే, పెట్టిన పెట్టుబడికి మార్కెట్ అవుతుంది, మేకర్స్ కి కూడా గిట్టుబాటు అవుతుంది.
ఇక మన దేశంలో ఉన్న కరోనా కఠిన పరిస్థితులు కుదుటపడి, అన్ని అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివర్లో ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ సినిమాని రిలీజ్ చేస్తారట. అలాగే వచ్చే ఏడాది సమ్మర్ లో రెండో పార్ట్ సినిమాని విడుదల చేస్తారట. శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.