
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 24 గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరోవైపు మరణాలు కాస్త పెరిగాయి. కొత్తగా 640 మంది మహమ్మరి బారినపడి మృత్యువాతపడ్డారు. వైరస్ నుంచి ఇప్పటి వరకు 3,07,01,612 మంది కోలుకున్నారు.