https://oktelugu.com/

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. లైవ్ వీడియో

ప్రియుడు మహేష్ ఆటో డ్రైవర్.. నిండా 25 ఏళ్లు కూడా లేవు.. ప్రియురాలు పేరు శివప్రత్యూష.. మైనార్టీ కూడా తీరలేదు 17 ఏళ్లు మాత్రమే.. మహేష్ ఆటో డ్రైవర్.. ప్రత్యూష మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. స్కూల్ కు వెళ్లేటప్పుడు ఆటోతో పరిచయమైన మహేష్ ను ప్రేమించింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఆ ఆకర్షణనే ప్రేమ అనుకొని ఘాడంగా వెళ్లిపోయింది ప్రత్యూష. మహేష్ ను పెళ్లి చేసుకుంటానంది.తల్లిదండ్రులు ఇంత చిన్న పిల్లవు ఎందుకు నీకు అంటూ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 29, 2021 / 10:49 AM IST
    Follow us on

    ప్రియుడు మహేష్ ఆటో డ్రైవర్.. నిండా 25 ఏళ్లు కూడా లేవు.. ప్రియురాలు పేరు శివప్రత్యూష.. మైనార్టీ కూడా తీరలేదు 17 ఏళ్లు మాత్రమే.. మహేష్ ఆటో డ్రైవర్.. ప్రత్యూష మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. స్కూల్ కు వెళ్లేటప్పుడు ఆటోతో పరిచయమైన మహేష్ ను ప్రేమించింది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

    అయితే ఆ ఆకర్షణనే ప్రేమ అనుకొని ఘాడంగా వెళ్లిపోయింది ప్రత్యూష. మహేష్ ను పెళ్లి చేసుకుంటానంది.తల్లిదండ్రులు ఇంత చిన్న పిల్లవు ఎందుకు నీకు అంటూ బెదిరించారు. కొట్టారు. మహేష్ ను పెళ్లిచేసుకుంటానన్న ప్రత్యూష ప్రతిపాదనకు అంగీకరించలేదు.

    చిత్తూరు జిల్లా తంబల్లపల్లి మండలం కోటాల పంచాయతీ ఎగువబోయనపల్లికి చెందిన ప్రత్యూష, మహేష్ లు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ పారిపోయారు. మార్చి 19న పీఎస్ పోలీస్ మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.

    ఇక తమను బ్రతకనీయరు అని డిసైడ్ అయిన ఈ ప్రేమ జంట కూల్ డ్రింక్ లో క్లోరైడ్ కలుపుకొని తాగుతూ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సెల్ఫీ వీడియోను తీసుకొని ఫేస్ బుక్ లో పెట్టింది. ఆ సెల్ఫీ వీడియోను చూసిన పోలీసులు వెంటనే వారు ఆత్మహత్యాయత్నం చేసి కమ్మరివాండ్లపల్లి వద్దకు వచ్చి మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.

    ఇద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది.