https://oktelugu.com/

కాకినాడలో ‘ఆచార్య’.. చిరు కాంప్రమైజ్ కావట్లేదు !

‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఏదైనా సీన్ అనుకున్న విధంగా రాకపోతే.. వెంటనే మళ్ళీ షూట్ పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ను కాకినాడలో ఫిక్స్ చేశారు. కాగా ఈ షెడ్యూల్‌ మూడు నుంచి ఐదు రోజులు […]

Written By:
  • admin
  • , Updated On : July 29, 2021 / 10:40 AM IST
    Follow us on

    ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఏదైనా సీన్ అనుకున్న విధంగా రాకపోతే.. వెంటనే మళ్ళీ షూట్ పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ను కాకినాడలో ఫిక్స్ చేశారు.

    కాగా ఈ షెడ్యూల్‌ మూడు నుంచి ఐదు రోజులు జరగనుంది. కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. మెయిన్ గా చిరంజీవి, సోనూసూద్‌ కాంబినేషన్‌ లో వచ్చే సీన్స్‌ ను తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సీన్స్ ప్రీ క్లైమాక్స్ లో వస్తాయట. సినిమాలో హెవీ ఎమోషనల్ గా సాగే ఈ సీన్స్ ను కొరటాల చాలా కొత్తగా రాశాడట.

    ఇక ఆ మధ్య రిలీజ్ అయిన ‘లాహే లాహే’ పాట విపరీతమైన బజ్ తో ఫుల్ వ్యూస్ తో ఇప్పటకే 60 మిలియన్ల రికార్డ్ వ్యూస్ ను దక్కించుకుని మెగాస్టార్ స్టార్ డమ్ ఏంటో రుచి చూపించింది. పైగా మెగాస్టార్ కెరీర్ లో ఒక సాంగ్ కి ఇలా 60 మిలియన్ల వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

    ముఖ్యంగా ఈ సాంగ్ మధ్యలో చిరు వేసిన క్రేజీ స్టెప్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చాయి. అలాగే సాంగ్ లో సీనియర్‌ నటి సంగీత కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా మంచి బజ్ ఉండే అవకాశం ఉంది.

    అలాగే చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు.