
దేశంలో తాజాగా కొత్త కేసులు పెరిగాయి. 18,52,140 మందిని పరీక్షించగా 42,015 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు 30 వేలకు తగ్గిన కేసులు తాజాగా 40 శాతం మేరకు పెరిగాయి. నిన్న మరణాలు మాత్రం 3,998గా నమోదయ్యాయి. ప్రస్తుతం 4,07,170 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. 36,977 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే నిన్న రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.