Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి ఏమిటి ?

ప్చ్.. సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి ఏమిటి ?

Single screens theaters parking fee తెలంగాణలో ధియేటర్లను తెరిచేందుకు జూలై 23 నుంచి ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసి, థియేటర్ యజమానులకు శుభవార్త చెప్పింది. 2018లో ధియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరించింది. ఈ సవరణతో తాజాగా పార్కింగ్ కు ఫీజు వసూలు చెయ్యొచ్చు.

ఇలా తెలంగాణ ప్రభుత్వం పార్కింగ్ ఫీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముఖ్య కారణం, నష్టాల్లో ఉన్న ధియేటర్లకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అట. కానీ ప్రజలు కూడా సంతోషంగా లేరు కదా. అనేక సమస్యలతో కరోనా కూడా వారిని బాగా ఇబ్బంది పెడుతుంది. అసలు ఒకపక్క కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. అలాంటిది ఇప్పుడు థియేటర్స్ ఓనర్స్ లాభాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాల బాధాకరమైన విషయం.

అసలకే బ్లాక్ లో టికెట్స్ అముకుంటున్నారు. ఆ విషయంలోనే ప్రభుత్వం సంవత్సరాల తరబడి ప్రేక్షక పాత్ర వహిస్తూ ప్రేక్షకుడి జేబుకు చిల్లు పెట్టింది. ఇప్పుడు థియేటర్ పార్కింగ్ ఫీజ్ కూడా పెట్టి అదనపు బాదుడు మొదలుపెట్టింది. ఈ ఉత్తర్వులు థియేటర్స్ కి, సినిమా వాళ్లకు పెద్ద ఊరట ఇవ్వొచ్చు. మరి సామాన్య ప్రేక్షకుడి పరిస్థితి ఏమిటి ?

ప్రభుత్వం చెబుతున్న వివరణను బట్టి.. ధియేటర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలిపివేస్తున్నారని, దాంతో సరైన పర్యవేక్షణ లేక శాంతిభద్రతల సమస్య వస్తోంది అని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. దాంతో అధిక వాహనాల నిలిపివేత ఉండదు అని, ఆ ఉద్దేశ్యంతోనే తాజాగా ఉత్తర్వులను సవరిస్తూ పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా ఆదేశించామని చెబుతుంది ప్రభుత్వం.

ఇలా ఎన్ని చెప్పినా సామాన్యుడు ఇలాంటి విషయాలను అసలు సహించడు. ఓటుతో బదులు చెబుతాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular