
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కేసుల నమోదు సంఖ్య తగ్గుతున్నా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 373 మంది వైరస్ తో బాధపడుతూ మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. తాజాగా 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు.