
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 2,08,921 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,95,955 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా 4,157 మంది మహమ్మారి బారినపడి మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795 కు పెరిగాయని, ఇప్పటి వరకు 2,43,50,816 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి మొత్తం 3,11,388 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 24,95,591 యాక్టివ్ కేసులున్నాయి.