
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇటీవల 40 వేల దిగువకు పడిపోయిన కేసులు వరుసగా రెండోరోజు పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గుణాంకాలను వెల్లడించింది. తాజాగా 19,21,450 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 48,786 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే 6 శాతం పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు.