
భారత్ లో కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తుంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,79,164 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 3,646 మంది బాధితులు కరోనా కారణంగా మరణించారు. ఇన్ని కేసులు మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. మే ప్రారంభానికి ముందే ఇన్ని కేసులు మరణాలు నమోదవుతుండటంతో అంతటా భయాందళనలు నెలకొన్నాయి.