
దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తాజాగా 81 వేలకు దిగువన కరోనా కేసులు నమోదవగా 71 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. మరోసారి మూడువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 80,834 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. కొత్తగా 1,32,062 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 3,303 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,39,989 కి పెరిగింది.