
కరోనాకు సంబంధించిన అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని బెంగాల్ సర్కారు నిర్ణయం తసుకుంది. ఇకపై బెంగాల్ ప్రభుత్వ అనుబంధ విద్యాసంస్థల్లోని 11వ తరగతిలో కరోనా వైరస్ కు సంబంధించిన అంశాలను బోధించనున్నారు. ఇందులో కరోనా గురించి, దాని వ్యాప్తి, లక్షణాలు, క్వారంటైన్ వంటి అంశాలను పొందుపరుస్తామని బెంగాల్ సర్కారు తెలిపింది. విద్యార్థులకు కరోనాపై కనీస అవగాహన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.