
నాగార్జునసాగర్ వద్ద ఏపీ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కాగా గురువారంతో పోలిస్తే బలగాల సంఖ్యను తగ్గించి వేశారు. మరోవైపు తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. వినతిపత్రం స్వీకరణకు కూడా తెలంగాణ జెన్కో అధికారులు అనుమతించని పరిస్థితి ఏర్పాడింది. దీంతో తదుపరి ఏం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురు చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.