
2021 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే సుమారు 1470 కిలోమీటర్ల పొడవును జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్లు రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్ – మే నెలల్లో 847 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి రెండు నెలల్లో 73.5 శాతం వేగంగా నిర్మాణ పనులు జరిగాయని ట్వీట్ చేసింది.