పెట్రోల్, డీజిల్ ధరలను పెంపునకు నిరసనగా చలో రాజ్ భవన్ కు యత్నించిన కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా ముగిసిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా రాజ్ భవన్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ సహా నేతలు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.