
విజయవాడలో వామపక్ష, టీడీపీ, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ కలిసేందుకు విద్యార్థి సంఘం నేతలు బయలుదేరారు. తుమ్మలపల్లి వద్ద అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.