
ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు ఫిర్యాదులు సమర్పించేందుకు వాట్సాప్, ఈ మెయిల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు ఏమైనా సమస్యలుంటే ascmro@telangana.gov.in మెయిల్ లేదంటే 9133089444 నంబర్ కు వాట్సాప్ చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్ కుమార్ సూచించారు. సమయభావం లేకుండా సమస్యలు పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.