
తెలంగాణ విముక్తి కోసం రావి నారాయణరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నారాయణరెడ్డి గొప్ప స్ఫూర్తి ప్రదర్శించారని కొనియాడారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించారని చెప్పారు. పోరాటల విజయవంతానికి నారాయణరెడ్డ నిర్దిష్ట కార్యాచరణ ఆచరించారని వివరించారు.