Homeజాతీయ వార్తలుCockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ పై హిట్ స్ప్రే.. నరేంద్ర మోడీ...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ పై హిట్ స్ప్రే.. నరేంద్ర మోడీ ప్లాన్ అదిరిపోయిందిగా..

Cockroach Janata Party : ఏదో అనుకుంటే ఏదో జరిగింది.. వెస్ట్రన్ మీడియా గట్టిగా అనుకుంది.. ఇంకా కొంతమంది లెఫ్ట్ జర్నలిస్టులు ఏదో చేద్దామనుకున్నారు. మొత్తానికి వీళ్ళ ప్లాన్ మొత్తం దెబ్బతిన్నది. ఏదో జరిగిపోతుంది అనుకుంటే మొత్తానికి తుస్సుమన్నది. ఇదంతా కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల చేపట్టిన ఆందోళన గురించి

బంగ్లాదేశ్ మాదిరిగా.. శ్రీలంక మాదిరిగా.. నేపాల్ మాదిరిగా ఆందోళనలు పుట్టించి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించాలని కొంతమంది బలంగా అనుకున్నారు. నీట్ పేపర్ లీకేజీని దృష్టిలో పెట్టుకొని.. దీని అంతటికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కారణమని.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ పార్టీ నేతలు హంగామా సృష్టించడం.. మనదేశంలో కొన్ని మీడియా సంస్థలు ఈ పార్టీకి సపోర్ట్ చేయడంతో వ్యవహారం కాస్త పెద్దదిగానే మారిపోయింది.

దీనివల్ల ఏదైనా జరగొచ్చు.. ఏమైనా కావచ్చు అని కొంతమంది ఉదారవాదులు భావించారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవడం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. టీవీ స్టూడియోలలో గొంతులు చించుకొని అరిచారు. కానీ జరిగింది వేరు. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ లాస్ట్ మినిట్లో అనుమతులు అడిగినప్పటికీ.. ఢిల్లీ పోలీసులు ఆందోళనకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పటిష్టమైన బందోబస్తు కల్పించారు.

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తారని ముందుగానే కొంతమంది ఊహించారు. వెస్ట్రన్ మీడియా సంస్థలు కూడా అక్కడ కాచుకొని ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు అరెస్ట్ చేయకుండా అతనిని వదిలేశారు. విఐపి లాంజ్ నుంచి అతడు వస్తుంటే.. సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తర్వాత అతడు విలేకరులను చూసి గట్టిగా అరుస్తుంటే కూడా మిన్న కుండిపోయారు.

ఇలా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు రచించిన ప్రణాళికలు మొత్తం ఎక్కడికి అక్కడ ఫ్లాప్ కావడంతో.. చివరికి జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా జనం సరిగ్గా రాలేదు.. యువత భారీగా వస్తారు అనుకుంటే అది కూడా జరగలేదు. కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులు.. కమ్యూనిస్టు సంఘాల కార్యకర్తలు మాత్రమే అక్కడికి వచ్చారు. వారంతా కూడా కొందరేమో ఉమర్ ఖలీల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. 370 అధికరణ రద్దు చేయాలని.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రాన్ని వేరే లాగా ఉంచాలని.. ఇలా రకరకాల డిమాండ్లు చేశారు.

నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం గురించి.. ఆందోళన చేస్తామని చెప్పిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు.. చివరికి ఇలా చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఎంత దారుణంగా ఉందంటే.. అక్కడి ఆందోళనకు ఒక వృద్ధుడు వచ్చాడు.. అతడు ఉమర్ ఖలీల్ గురించి నినాదాలు చేశాడు. దీనిపై ఒక మహిళా జర్నలిస్ట్ స్పందిస్తే..”అతడు నిన్నేమైనా చేశాడా.. పోనీ మీ అమ్మని ఏమైనా చేశాడా” అంటూ అత్యంత దారుణంగా మాట్లాడాడు.

ఈనేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను నిలదీశారు. ఇదేం విధానం అంటూ మండిపడ్డారు. దీంతో అక్కడ భారీ ఎత్తున గొడవ కూడా జరిగింది.. ఇలా చెప్పుకుంటూ పోతే కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలో చోటు చేసుకున్న పరిణామాలు చాలానే ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్స్ లాగా ఉన్నాయి. బంగ్లాదేశ్ మాదిరిగా.. శ్రీలంక మాదిరిగా.. చేద్దామనుకొని చివరికి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు బొక్క బోర్లా పడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular