
ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జెండా వందనం తర్వాత సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. కోవిడ్ ఆంక్షల దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.