CM Revanth Reddy: తెలంగాణ లో అత్యాధునిక గోశాలల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గోశాలల ఏర్పాటు కోసం కమిటీని నియమించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంంధించిన డిజైన్లను నాలుగైదు రోజుల్లో ఖరారు చేయాలని చెప్పారు. గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.