
సూర్యాపేట జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ షర్మిల మేడారంలో నిరుద్యోగులతో ముఖముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉద్యమంలో 1200 మంది ప్రాణాలు కోల్పోతే ప్రస్తుతం వందలమంది ఉద్యోగాల కోసం మళ్లీ ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో లక్షకు పైగా ఖాళీలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లక్షా 91 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ లను సీఎం కేసీఆర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.