దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ మరోసారి ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ఎస్సీలకు ఇప్పటికే దళితబంధు నిధులు మంజూరైన నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. 76 ఎస్సీ కుటుంబాల కోసం యాదాద్రి జిల్లా కలెక్టర్ ఖాతాలో ఇప్పటికే 7 కోట్ల 6లక్షల రూపాయలను ప్రభుత్వం డిపాజిట్ చేసింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఎలా వాడుకోవాలనే అంశంపై అధికారులు వారికి అవగాహన కల్పించి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.