
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. జిల్లాల్లో వర్షపాత వివరాలు, లోతట్టు ప్రాంతాల్లో మునకలు సహా వివిద అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్రభావిత జిల్లాల్లో అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.