
బేంగంపేట నుంచి హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాకు చేరుకున్నారు. సీఎం రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సభాస్థలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీలు అమలును సీఎం సమీక్షించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించాలని, ఆయన గెలిచాక వచ్చి అధికారులతో సమీక్షించి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆరే స్వయంగా హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించనున్నారు.