
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని వాళ్లని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. అలాగని ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. నీటివివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.