
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఆయనతో చర్చించనున్నారు. సీఎం వైఎస్ జగన్ అంతకు ముందు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ తో భేటీ అయ్యారు. పోలవరంతో సహా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.