
రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాధితుల ఖాతాల్లో నగదును జమ చేశారు. రూ. 10 వేలలోపు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ. 207.61 కోట్లు, రూ, 20 వేల అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ, 459.23 కోట్ల నగదును చెల్లింపులు చేశారు. దాదాపు 7 లక్షలకుపైగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 666.84 కోట్ల నగదును ఏపీ ప్రభుత్వం జమ చేసింది.