CM Chandrababu: క భాషలో మాట్లాడిన బాలుడి ప్రతిభకు ఫిదా అయ్యారు సీఎం చంద్రబాబు. శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు, టీచర్స్ తో సమావేశమైన చంద్రబాబు.. పిల్లల చదువు కొనసాగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మచ్చటించిన సీఎం వారి భవిష్యత్ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. చదువులో బాగా రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వారికి నిర్దేశించారు.
క భాషలో మాట్లాడిన బాలుడి ప్రతిభకు ఫిదా అయిన సీఎం చంద్రబాబు pic.twitter.com/Jvj1EcorHC
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025