Kingdom release date: ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు వాయిదాపడిన చిత్రం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie). కేవలం టెక్నికల్ పనులు బ్యాలన్స్ ఉండడం వల్లే ఈ సినిమా అన్ని సార్లు వాయిదా పడింది. మధ్యలో సెకండ్ హాఫ్ ని చాలా వరకు రీ షూట్ చేశారట. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్(Anirudh Ravichander) సకాలంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు రీ రికార్డింగ్ వర్క్ ని పూర్తి చేయలేకపోవడం వంటి కారణాలతో ఈ సినిమా ఇలా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఆ పనులన్నీ ఒక కొలిక్కి రావడం తో ఈ చిత్రాన్ని ఈ నెల 31 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈసారి కూడా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నయాట. ఎందుకంటే వర్క్ చాలా ఒత్తిడి నడుమ జరుగుతుందట.
Also Read: పునర్జన్మ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు’..పూర్తి స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
జులై 31 సమయానికి కేవలం తెలుగు, తమిళ వెర్షన్స్ మాత్రమే రెడీ అవుతాయి అనే అంచనాతో హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ కి మంచి మార్కెట్ ఉన్న ప్రాంతాలు ఇవి. అయితే ఇప్పుడు ఆ సమయానికి తెలుగు వెర్షన్ కూడా పూర్తిగా రెడీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. కానీ మూవీ టీం ఆ సమయానికి సినిమాని రెడీ చేసేలా రేయింబవళ్లు కష్టపడి, నిద్రాహారాలు మానేసి మరి పని చేస్తున్నారట. చూడాలి మరి ఆ డేట్ కి వస్తుందా లేదా అనేది. ప్రొమోషన్స్ కి , సినిమాలోని సాంగ్స్ విడుదల కి ఎక్కువ సమయం లేదు. ఇదే మూవీ టీం కి పెద్ద సమస్య గా మారింది. దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి. వాస్తవానికి జులై 31 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత నాగవంశీ కి ఏమాత్రం ఇష్టం లేదు.
ఎందుకంటే అప్పటికి పనులు పూర్తి అవుతాయనే నమ్మకం లేదు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కురించుకున్న ఒప్పందం వల్ల తప్పనిసరి పరిస్థితిలో జులై 31న విడుదల చేయాల్సి వస్తుంది. ఆగష్టు 14 న విడుదల అవ్వబోయే ‘వార్ 2 ‘ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ని నాగవంశీ కొనుగోలు చేశాడు. కాబట్టి ఆగష్టు 7 న ‘కింగ్డమ్’ ని విడుదల చేయలేదు కాబట్టి, ఆగష్టు 28 న విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకున్నాడు. ఆమేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థ ని ఒప్పించేందుకు చాలా గట్టి ప్రయత్నమే చేశాడు. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే కచ్చితంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది అనే కండీషన్ పెట్టింది. దీంతో మేకర్స్ తప్పనిసరి పరిస్థితిలో జులై 31 న కేవలం రెండు భాషల్లోనే విడుదల చేయాల్సి వస్తుంది.
GOATani blesses the Kingdom with a loop, it rules on Repeat #Kingdom || #VijayDeverakonda pic.twitter.com/MGWz2twrA7
— kiran (@kirancsiva) July 9, 2025