Chandrababu Naidu’s alleged dissatisfaction : కొందరు మంత్రుల తీరుతో సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం ఫైర్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్ శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చార్జీలు తగ్గించిన సంగతి తెలిసిందే. ట్రూ డౌన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చార్జీలను తగ్గించింది. చార్జీలు తగ్గించడం ఉమ్మడి ఏపీలో ఇదే తొలిసారి. కానీ దీనిపై విద్యుత్ శాఖ ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున చార్జీలు తగ్గిస్తే ప్రచారం చేసుకోకపోతే ఎలా అంటూ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంటే ఏం చేస్తున్నారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది.
* ప్రతిసారి దీనిపై చర్చ..
వాస్తవానికి క్యాబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి మంత్రుల వ్యవహార శైలి చర్చకు వస్తోంది. కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు మాత్రమే అవుతోంది. సాధారణంగా మంత్రివర్గ విస్తరణ అనేది రెండేళ్లకు ఒకసారి జరుపుతారు. గత వైసిపి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత విస్తరణ చేపట్టింది. కానీ చంద్రబాబు సర్కార్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల తరువాత నుంచి వింత ప్రచారం జరిగింది. మంత్రుల మార్పు ఉంటుందన్నది దాని సారాంశం. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది.
* సీఎం మందలించినట్టు ప్రచారం..
అయితే తాజాగా విద్యుత్ చార్జీలకు సంబంధించి ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యా మన అసంతృప్తి చంద్రబాబులో కనిపిస్తోంది. దీనిపై సంబంధిత మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే క్యాబినెట్ సమావేశం జరిగిన ప్రతిసారి ఇటువంటి ప్రచారం జరగడం సర్వసాధారణంగా మారింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కోస్తా, రాయలసీమ జిల్లాల నుంచి నలుగురు మంత్రులపై వేటు అని ఎప్పటినుంచో ప్రచారం సాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అటువంటి చర్యలకు దిగలేదు. ఇప్పుడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పై వేటు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రాజకీయంగా ఆయన బలమైన నేత. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.