రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో టీమిండియా తలపడుతోంది. ఈ సిరీస్లో ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే ఊపులో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులో దూకుడు కొనసాగిస్తోంది. తొలి రోజు శతక గర్జన చేసిన జైస్వాల్.. రెండవ రోజు మాత్రం ఆ జోరు సాగించలేకపోయాడు. ద్వి శతకం చేస్తాడనుకుంటున్న తరుణంలో అతడు అవుట్ కావడం సంచలనం కలిగిస్తోంది.
జైస్వాల్ ఔట్ వెనక టీమిండియా కెప్టెన్ గిల్ ఉన్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. టీమిండియా సారధి పట్ల మండిపడుతున్నారు.. గిల్ వల్లే జైస్వాల్ రన్ ఔట్ అయ్యాడని నెటిజన్లు మండిపడుతున్నారు. గిల్ కనుక ఫీల్డర్ ను చూడకుండా పరుగు తీసి ఉంటే రన్ పూర్తయ్యేదని వ్యాఖ్యానిస్తున్నారు. అతడు స్వార్థపూరితమైన ఆటగాడని.. అందువల్లే జైస్వాల్ అవుట్ అయ్యాడని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జైస్వాల్ నేరుగా ఫీల్డర్ ఉన్న చోటికి షాట్ ఆడాడని.. అసలు ఆచోట పరుగు తీయాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. వాస్తవానికి శనివారం రెండవ రోజు జైస్వాల్ ఉదయం వరకే డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 175 పరుగుల వద్ద అతడు అవుట్ అయ్యాడు. రెండవ రోజు మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికి అతడు ఔట్ అయ్యాడు. ఫలితంగా టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. 23 సంవత్సరాలు వయసులో అత్యధిక సార్లు 150+ స్కోర్లు చేసిన ప్లేయర్ల జాబితాలో బ్రాడ్ మన్(8) తర్వాత జైస్వాల్ (5) రెండవ స్థానంలో ఉన్నాడు.
రనౌట్ అయినప్పటికీ జైస్వాల్ సూపర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అతడు టెస్టులలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 48 ఇన్నింగ్స్ లలో ఏడు సెంచరీలతో 2,418 పరుగులు చేశాడు. రూట్(ఇంగ్లాండ్) 44 ఇన్నింగ్స్ లలో 2,307 రన్స్ చేశాడు. ఆ తర్వాత డకెట్ 1,835, గిల్ 1,796, బ్రూక్ 1,792, పోప్ 1,471 పరుగులు చేశారు. ఒకవేళ వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ కనుక చేసి ఉంటే అరుదైన రికార్డు అతడి సొంతమయ్యేది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. కెప్టెన్ గిల్ 129 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నితీష్ రెడ్డి 43, జూరెల్ 44 పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు పడగొట్టాడు.
Selfish Shubman showed his true colours again
Jaiswal was on 175 but that Clown Gill chose not to run out of insecurity #INDvsWI pic.twitter.com/DKQZyCjh3y— Ayush Rajput (@Ayush_Rajput17) October 11, 2025