CM Chandrababu: టీడీపీది పేదల ప్రభుత్వమని సీఎం చంద్రబాబు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోససీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే పింఛను మొత్తన్ని పెంచం. పేదవాడి కోసం పింఛన్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని అన్నారు. మెగా డీఎస్సీతో పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టలన్న సంకల్పంతో పనిచేస్తుమని సీఎం అన్నారు.