CM Chandrababu: తెలుగు జాతీ మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండగ రోజు అని అన్నారు. ఒక వ్యక్తి రెండు రంగాల్లో రాణించడం చరిత్రలో చూడలేదు అని అన్నారు. నీతి, నిజాయతీ, పట్టుదల ఆయన ఆయుధాలు అని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం, ఆత్మాభిమానం వీడని నాకుడని అన్నారు. అధికారం అంటే బాధ్యత పదవి అంటే సేవ అని నిరూపించారని చంద్రబాబు అన్నారు.