
ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆనంతరం తెలంగాణ పీఆర్టీయూ నేతలు మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని, ప్రత్యక్ష తరగతుల వాయిదాకు సీఎం అంగీకరించారని తెలిపారు. జూలై 1 నుంచి ఆన్ లైన్ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వెల్లడించారు. రోజూ సగం మంది టీచర్లు విధులకు హాజరయ్యేందుకు కల్పించాలని కోరగా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని ఉపాధ్యాయ సంఘం నేతలు మీడియాకు వెల్లడించారు.