
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రేయింబవళ్లు శ్రమించి, విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్లు కుటుంబాలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భారీ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని బుధవారం ప్రకటించారు. కొవిడ్ సమయంలోవిధులు నిర్వహించిన మెడికల్ ప్రొఫెషనల్స్ కు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు ప్రోత్సాహకాలను సీఎం ప్రకటించారు.