తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రేపటి నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్ లు ప్రారంభిస్తామన్నారు. హొం ఐసోలేషన్ లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల […]
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రేపటి నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్ లు ప్రారంభిస్తామన్నారు. హొం ఐసోలేషన్ లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు.