ఇండియా- సింగపూర్ మీడియేషన్ సమ్మిట్ లో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వం తక్కువ ఖర్చుతో కూడుకుందన్నారు. మధ్యవర్తిత్వంతో సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వివాద పరిష్కారాల్లో రాజ్యాంగ సమానత్వం ఉండాలన్నారు. మధ్యవర్తులకు శిక్షణ ఇస్తే సాధారణ ప్రజానీకానికి మేలు జరుగుతుందన్నారు. మధ్యవర్తులు సలహాదారుడిగా మారడం మంచిది కాదని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.