
ఆన్ లైన్ విధానం ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకం జరపాలని సినీ ప్రముఖలే కారారని మంత్రి పేర్ని నాని అన్నారు. బ్లాక్ టిక్కెట్లు లేకుండా అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోదని అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. టిక్కెట్ రేట్లను, ఇష్టానుసారంగా షోలు వేయడాన్ని నియంత్రిస్తూ ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన జీవో ఇచ్చాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే టిక్కెట్ల విక్రయం జరిపేలా ఆదేశాలిచ్చాం. ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆలోచన చేసింది ప్రభుత్వం. దీనిపై అర్ధం లేని విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారని అన్నారు.