Chiropractic Therapy : ఈ థెరపీ చేయించుకుంటే.. పర్మినెంట్‌గా సైనస్‌కు చెక్ పెట్టినట్లే!
సైనస్ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని థెరపీలు కూడా బాగా పనిచేస్తాయట. ఇంతకీ ఆ థెరపీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎన్నిసార్లు చేయించుకోవాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Chiropractic Therapy : మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వాతావరణంలో మార్పుల వల్ల కొందరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం చలి కాలం కావడంతో కొందరు జలుబు, దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొందరు సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంటుంది. సైనస్ ఉంటే చల్ల గాలి తగలకూడదు. అలాగే చల్లని పదార్థాలు వంటివి తినకూడదు. వీటిని తింటే సైనస్ సమస్య ఇంకా పెరుగుతుంది. సైనస్ సమస్య ఉండటం వల్ల కొన్ని ఆహార పదార్థాలను సరిగ్గా తినలేరు. కాస్త వాతావరణం మారిన బాడీలో మార్పులు వంటివి వస్తాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి కొందరు ఎన్నో రకాల మందులు వాడుతుంటారు. వీటిని వాడిన కూడా కొందరికి ఈ సైనస్ సమస్య తగ్గదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సైనస్ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని థెరపీలు కూడా బాగా పనిచేస్తాయట. ఇంతకీ ఆ థెరపీ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఎన్నిసార్లు చేయించుకోవాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సైనస్ సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని థెరపీలు ఉన్నాయి. ఈ థెరపీలు పూర్వ కాలం నుంచి ఉంటున్నాయి. పూర్వం రోజుల్లో వీటి ద్వారానే కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించుకునేవారు. వీటిని తీసుకోవడం ఎలాంటి సమస్య అయిన కూడా తగ్గిపోతుందని నమ్ముతారు. అయితే ఈ సైనస్ సమస్య తగ్గాలంటే ముఖ్యంగా చిరోప్రాక్టిక్ థెరపీ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని చేయించుకోవడం వల్ల సైనస్ సమస్య ఈజీగా తగ్గుతుందట. ఈ చిరోప్రాక్టిక్ థెరపీలో మాన్యువల్ థెరపీ చేస్తారు. ఇది కేవలం సైనస్‌ను మాత్రమే తగ్గించకుండా కండరాలు, ఎముకలు, కీళ్లు, నరాల సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే కొందరికి ఎముకలు, నరాలు విరిగిపోతాయి. అలాంటి వారికి కూడా ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఈ థెరపీ చేయించుకోవడం వల్ల ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది.
చిరోప్రాక్టిక్ థెరపీ వల్ల శరీర నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే మైగ్రేన్, వెన్ను నొప్పి, సయాటికా, మెడ నొప్పి, కండరాల నొప్పులు, ఎముకల సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తహీనత, బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ చిరో ప్రాక్టిక్ థెరపీ అనేది అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ థెరపీని నచ్చినట్లుగా చేయించుకోకూడదు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. అన్ని విధాలుగా చూసుకుంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.