https://oktelugu.com/

Tollywood Heros : బాలీవుడ్ హీరోలు చేసిన తప్పులను మన హీరోలు చేస్తే పతనం తప్పదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. పాన్ ఇండియాలో బాలీవుడ్ హీరోలను సైతం తలదన్నే రీతిలో మన హీరోలు ఎదిగిన వైనం చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అనేంతలా గుర్తింపును సంపాదించి పెట్టారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 25, 2024 / 11:16 PM IST

    Tollywood Heros

    Follow us on

    Tollywood Heros :  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు మనవాళ్లు సాధించిన విజయాలు ఎలా ఉన్నా కూడా భారీ కలెక్షన్స్ ను అయితే కొల్లగొడుతున్నారు. ఇక మొత్తానికైతే బాలీవుడ్ హీరోలకు చెక్ పెడుతూ మనవాళ్లు స్టార్ హీరోలుగా ఎదగడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో ఉన్న ప్రతి డైరెక్టర్ కూడా మన హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోలు సైతం మన దర్శకులతో సినిమాలు చేసి మరో మంచి సక్సెస్ ని సాధించి మళ్లీ మార్కెట్లోకి వాళ్ళని వాళ్ళు ఫ్రెష్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన దర్శకులు మాత్రం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు తప్ప బాలీవుడ్ హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు దూసుకెళ్ళలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత సంవత్సరం షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు.

    అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక షారుక్ ఖాన్ ను మినహాయిస్తే మిగిలిన హీరోలు ఎవ్వరూ కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేయడం లేదు. ఇక అమీర్ ఖాన్ అయితే ‘లాల్ సింగ్ చధ్ధా’ సినిమా తర్వాత ఇప్పటివరకు మరొక సినిమా అయితే అనౌన్స్ చేయలేదు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికి తను మంచి కథ కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది.

    మరి తెలుగు దర్శకులతో సినిమాలు చేయాలనే కాన్సెప్ట్ తో ఉన్న వాళ్లకి బాలీవుడ్ దర్శకులు ఎలాంటి కథలు చెప్పినా కూడా నచ్చడం లేదట. ఇక మన హీరోలు ఇంకో పది సంవత్సరాల పాటు స్టార్ హీరోలుగా కొనసాగాలి అంటే బాలీవుడ్ హీరోల మాదిరిగా కాకుండా ఎక్స్పరిమెంట్లను చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ఇక అలాంటివి చేయకుండా ఇంతసేపు ఎలివేషన్స్, ఎమోషన్స్ మీదనే డిపెండ్ అవుతూ ముందుకెళ్తే మాత్రం మన తెలుగు హీరోలు కూడా డౌన్ ఫాల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

    కాబట్టి బాలీవుడ్ హీరోలను తలదన్నే రీతిలో వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగితేనే మన వాళ్ళ ఫ్యూచర్ చాలా కాలం పాటు పాన్ ఇండియాలో కొనసాగుతుంది. లేకపోతే మాత్రం మనవాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయే పరిస్థితి రావచ్చు…