Knuckling Fingers : వేళ్లు విరుచుకుంటే సౌండ్ ఎందుకు? ఇలా విరవడం వల్ల వచ్చే సమస్యలేంటి?
వేళ్లు విరిస్తే సౌండ్ రావడానికి ఓ కారణం. అసలు ఎందుకు వేళ్లు విరిస్తే సౌండ్ వస్తుంది? దీనివల్ల ఆరోగ్యానికి మంచిదేనా? లేకపోతే ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.
Knuckling Fingers : సాధారణంగా అందరికి కూడా ఖాళీ సమయం ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంతో కొంత ఖాళీ సమయం అయితే దొరుకుతుంది. ఇలాంటి సమయాల్లో కొందరు వేళ్లు విరుస్తుంటారు. కేవలం ఖాళీగా ఉనప్పుడు అనే కాకుండా పని చేస్తున్న కూడా కొన్నిసార్లు వేళ్లు విరుచుకుంటారు. ఇలా విరుచుకున్నప్పుడు వాటి నుంచి సౌండ్ వస్తే కొందరికి సరదాగా ఉంటుంది. ఒక ఆటలా ఫీల్ అవుతుంటారు. అసలు వేళ్లు విరిచినప్పుడు సౌండ్ ఎందుకు వస్తుందని ఎప్పుడైనా గమనించారా. అసలు వేళ్లు విరిచినప్పుడు సౌండ్ ఎందుకు వస్తుందో మనలో చాలా మందికి తెలియదు. కొందరు ఎక్కువ పనిచేయడం వల్ల వేళ్లు విరిస్తే సౌండ్ వస్తుందని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. ఏదో సరదాకి ఎవరో చెప్పిన దాన్ని కొందరు ఇలా చెప్తుంటారు. అయితే వేళ్లు విరిస్తే సౌండ్ రావడానికి ఓ కారణం. అసలు ఎందుకు వేళ్లు విరిస్తే సౌండ్ వస్తుంది? దీనివల్ల ఆరోగ్యానికి మంచిదేనా? లేకపోతే ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.
వేళ్ల విరిస్తే శబ్ధం ఎందుకు వస్తుందంటే?
వేళ్లు విరిచేటప్పుడు ఎముకల మధ్య ఖాళీ ఏర్పడుతుంది. దీంతో ఆ ఎముకల జాయింట్ల మధ్య సినోవియల్ లిక్విడ్‌తో ఓ బుడగ ఏర్పడుతుంది. అది పేలడం వల్ల శబ్ధం వస్తుంది. మీరు వేళ్లను విరిచేటప్పుడు ఆ గాలి బుడగ పేలి సౌండ్ వస్తుంది. కానీ మనకి మాత్రం ఎముకలు విరిగిన శబ్ధం వస్తుంది. అయితే ఇలా వేళ్లను ఎక్కువగా విరిస్తే కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా చేతి వేళ్లను విరచడం వల్ల చేతుల్లో ఉండే కీళ్లు బలహీనంగా మారుతాయి. దీంతో కనీసం ఒక డబ్బా మూతను కూడా తెరవలేరు. దీనివల్ల కండరాలు, ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అలాగే ఇలా చేతులను నొక్కడం వల్ల వాటిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో చేతులు కొన్నిసార్లు వాపునకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదో సరదాగా చేతి వేళ్లను ఇలా కొందరు విరుస్తుంటారు. ఏదో సాధారణంగా ఉంటుంది. ఇలా విరవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అనుకుంటారు. కానీ దీనివల్ల మీ ఆరోగ్యాన్ని మీరే దెబ్బతీసుకున్న వారు అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇలా చేతి వేళ్లను విరవడం వల్ల కొంతమందికి ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొందరు నిపుణులు అంటున్నారు. ఎక్కువగా వేళ్లు విరవడం వల్ల చేతి లోపల ఉండే కీళ్లు దెబ్బతింటాయి. దీనివల్ల ఏ వస్తువును కూడా సరిగ్గా పట్టుకోలేరు. దీనివల్ల చేతుల్లో పటుత్వం కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సరదాగా కూడా ఎక్కువగా చేతి వేళ్లన విరవద్దు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.