
కొన్ని రోజులుగా నియంత్రణ కోల్పోయి భూమి పై ఎక్కడ కూలుతుందా అని టెన్షన్ పెట్టిన చైనాకు చెందిన అతిపెద్ద రాకెట్ హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత తన భాగాలను చాలా వరకూ కోల్పోయిన రాకెట్ చివరికి సముద్రంలో కూలిపోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10:24 గంటలకు లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ భూవాతావరంలోకి తిరిగి ప్రవేశించింది. ఆ తర్వాత 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65డిగ్రీ ఉత్తర అక్షాంశాల దగ్గర కూలిపోయినట్లు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ వెల్లడించినట్టు చైనీస్ మీడియా తెలిపింది.