
అగ్రరాజ్యం అమెరికా సరసన చైనా చేరింది. డ్రాగన్ దేశానికి చెందిన జురాంగ్ రోవర్ మార్స్ గ్రహం పై దిగింది. ఆరు చక్రాలు ఉన్న రోబోను విజయవంతంగా దించినట్లు చైనా మీడియా పేర్కొన్నది. అంగారక గ్రహం పై ఉన్న ఉతోపియా శ్రేణులను టార్గెట్ చేస్తూ ఈ రోవర్ ను లాంచ్ చేశారు. ఉత్తర ధ్రువం వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో రోవర్ ను ల్యాండ్ చేయడం అసాధారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం అమెరికా మాత్రమే మార్స్ గ్రహం పై తన రోవర్ ను ల్యాండ్ చేసింది.