Xi Jinping leadership : చైనా డూప్లికేట్ తయారీకి పెట్టింది పేరు. అయినా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకనామీ కలిగిన దేశం. ఉత్పత్తి రగంలో గణనీయమైన పురోగతి సాధించిన చైనా ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక ఆర్థిక ప్రగతి మరింత వేగం పుంజుకుంది. ఇప్పుడు చైనా కూడా అగ్రరాజ్యానికి ధీటుగా సైనిక శక్తిని పెంచుకుంటూ విస్తరిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద సైనిక శక్తి చైనాది. తాజాగా ఓ అతున్నతస్థాయి మిటలటరీ నాయకుడిపై చైనాకు అనుమానాలు తలెత్తాయి. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. ఆ అధికారి జెనరల్ ఝాంగ్ యౌషియా. క్రమశిక్షణ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు సన్నిహితుడైన ఈ జెనరల్ విషయం ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగించింది.
ఝాంగ్ యౌషియా నేపథ్యం
75 ఏళ్ల ఝాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్(సీఎంసీ) వైస్ చైర్మన్. జిన్‌పింగ్ నేతృత్వంలోని ఈ సంస్థ చైనా సైన్యంపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడైన ఆయన తండ్రి పార్టీ వ్యవస్థాపక నాయకుడు. 1968 నుంచి సైన్యంలో సేవ చేసిన అనుభవజ్ఞుడు, సాధారణ రిటైర్మెంట్ వయసు దాటినా పదవిలో కొనసాగాడు.
దర్యాప్తు వివరాలు
’తప్పు చేశారు’ అనే పదం సామాన్యంగా అవినీతిని సూచిస్తుంది. ఝాంగ్‌తోపాటు సీనియర్ జెనరల్ లియు జెన్‌లీపై కూడా విచారణ జరుగుతోంది. డిసెంబర్‌లో పార్టీ కార్యక్రమానికి ఇద్దరూ హాజరు కాకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అక్టోబర్‌లో తొమ్మిది మంది ఉన్నతాధికారులను బహిష్కరించడంతో మిలిటరీలో ఇది అతిపెద్ద షేక్ అయింది.
జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక పోరాటం
అధికారంలోకి వచ్చిన తర్వాత జిన్‌పింగ్ అనేక రంగాల్లో అవినీతి వ్యతిరేక చర్యలు చేపట్టారు. మిలిటరీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర పోరాటం ప్రకటించారు. అవినీతిని పార్టీకి ప్రధాన ముప్పుగా చూస్తూ, సుపరిపాలన మెరుగుపరచాలని ప్రకటించారు.
సీఎంసీ సభ్యుల సంఖ్య తగ్గడంతో జిన్‌పింగ్ నియంత్రణ మరింత పెరిగింది. మద్దతుదారులు దీన్ని స్థిరత్వానికి దోహదపడుతుందని, విమర్శకులు రాజకీయ శత్రువులను తొలగించే చర్యగా చూస్తున్నారు. మొత్తంగా ఝాంగ్ విచారణ ఫలితాలు చైనా సైనిక నాయకత్వంలో మార్పులకు దారితీసే అవకాశం ఉంది.